గ్యాప్‌లేకుండా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విక్రమ్‌కుమార్ దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కుతున్న చిత్రం -గ్యాంగ్‌లీడర్. ఇటీవలే విడుదలై హిట్ టాక్ తెచ్చుకున్న జెర్సీ షూటింగ్ గ్యాప్‌లోనే గ్యాంగ్‌లీడర్ సెట్స్‌మీదకు వచ్చేశాడు నాని. జెర్సీ హిట్టుతో మంచి ఊపుమీదున్న నాని, గ్యాప్‌లేకుండా గ్యాంగ్‌లీడర్ రెండో షెడ్యూల్ షూట్‌కి రెడీ అయిపోయాడట. త్వరలో మొదలుకానున్న సెకెండ్ షెడ్యూల్‌లో హీరోయిన్ మేఘా ఆకాశ్ కూడా చేరునుందని చిత్రబృందం చెబుతోంది. అందం, అభినయం రెండూవున్నా మేఘాకు టాలీవుడ్‌లో టైం కలిసిరావడం లేదు. ఇంతకుముందు నితిన్‌తో రెండు చిత్రాలు చేసింది మేఘ. ఆ రెండు సినిమాలు ఫ్లాప్‌టాక్ తెచ్చుకోవడంతో మేఘకు సరైన బ్రేక్ రాలేదు. ఇప్పుడు నానితో చేస్తున్న ప్రాజెక్టుపైనే మేఘ గంపెడు ఆశలు పెట్టుకుంది. జెర్సీతో హిట్టుమీదున్న నాని తదుపరి ప్రాజెక్టుకూ మంచి ఫలితం అందితే -తన కెరీర్ గాడిలో పడుతుందన్న ఆశల్లో మేఘ కనిపిస్తోంది. స్క్రీన్‌కు తొలిసారి పరిచయం అవుతున్న ప్రియాంక అరుళ్ మరో హీరోయిన్‌గా కనిపించనుంది. ఆర్‌ఎక్స్ 100తో యంగ్ టాలెంట్ అనిపించుకుని హిట్టందుకున్న కార్తికేయ -గ్యాంగ్‌లీడర్‌లో విలన్ పాత్ర పోషిస్తుండటం తెలిసిందే.