భన్సాలీ కోటకు సౌత్ బార్బీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఛలో, గీతగోవిందం చిత్రాలతో తనస్థానాన్ని టాలీవుడ్‌లో పదిలం చేసుకుంది కన్నడ బ్యూటీ రష్మిక మండన. మరో నాలుగైదేళ్లు కెరీర్ పరంగా ఢోకాలేనంతగా బ్లాక్‌బస్టర్లు అందుకుని ప్రస్తుతం స్టార్ హీరోల వరుస చిత్రాలకు సంతకాలు చేసేస్తోంది. విజయ్ దేవరకొండ హీరోగా భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డియర్ కామ్రేడ్ చిత్రంలో రష్మిక హీరోయిన్. ఈ సినిమాతోపాటు మెగా కాంపౌండ్, అక్కినేని కాంపౌండ్ హీరోలతో రష్మిక అవకాశాలు అందుకుందని ప్రచారం సాగుతోంది. మరోవైపు అటు తమిళంలోనూ రష్మిక రంగప్రవేశం గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. తాజా సమాచారం ప్రకారం రష్మిక తొందర్లోనే బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టనుంది. అదీ సంజయ్‌లీలా భన్సాలీ లాంటి క్లాసికల్ డైరెక్టర్ ఏరికోరి రష్మికను ఓ సినిమాకి ఎంపిక చేసుకున్నట్టు సమాచారం. పద్మావత్‌లాంటి క్లాసిక్ మూవీ తర్వాత భన్సాలీ చాలా గ్యాప్ తీసుకుని భారీ చిత్రానికి సన్నాహాలు చేస్తున్నారు. రణదీప్ హుడా ఈ చిత్రంలో కథానాయకుడిగా నటించనున్నాడు. అతడి సరసన రష్మికను కథానాయికగా ఎంపిక చేసుకున్నారని, అయితే ఇంకా డీల్ చర్చల దశలోనే ఉందన్నది సమాచారం. ప్రస్తుతం భన్సాలీ అందించిన స్క్రిప్ట్ చదువుతోంది రష్మిక. స్క్రిప్టు ప్రకారం ఇదోథ్రిల్లర్ సినిమా. టైటిల్ ఖరారు కాలేదు. ఒకవేళ ఇదే నిజమైతే రష్మిక జాక్‌పాట్ కొట్టినట్టే.