టీజర్‌లో శివన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కల్వకోట సాయితేజ, తరుణీసింగ్ జంటగా శివన్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ సంతోష్‌రెడ్డి లింగాల నిర్మిస్తున్న లవ్ థ్రిల్లర్ ‘శివన్’. ‘ది ఫినామినల్ లవ్‌స్టోరీ’ అన్నది ట్యాగ్ లైన్. షూటింగ్ పూర్తి చేసుకొని. పోస్ట్‌ప్రొడక్షన్స్‌లోవున్న చిత్రం టీజర్ తాజాగా విడుదలైంది. నిర్మాతలు రాజ్‌కందుకూరి, వల్లూరిపల్లి రమేష్‌బాబు, ప్రముఖ దర్శకులు విఎం ఆదిత్య, ఆనంద్ రవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దర్శకుడు శివన్ చెప్పిన కథనచ్చి నిర్మాతనయ్యానని, మిత్రుడు బిట్టుతోపాటు ప్రతి ఒక్కరూ సినిమాకోసం అంకితభావంతో పనిచేసి అద్భుతమైన అవుట్‌ఫుట్ ఇచ్చారని నిర్మాత లింగాల సంతోష్‌రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. టీజర్ చూస్తుంటే పెద్దహిట్ అయ్యేలా ఉందని, ఉరకలెత్తించే ఉడుకు రక్తం కుర్రాళ్లు తీసిన ‘శివన్’ గురించి అంతా మాట్లాడుకునేంత గొప్పగా ఉందని రాజ్ కందుకూరి, వల్లూరిపల్లి, విఎన్ ఆదిత్య, ఆనంద్ రవి అన్నారు. నిర్మాతలు సంతోష్‌రెడ్డి, మురళితోపాటు టీమ్ సహాయ సహకారాలతోనే ‘శివన్’ ఇంత బాగావచ్చిందని దర్శకుడు శివన్ అన్నారు.