నెక్స్ట్ షెడ్యూల్‌లో డిస్కో రాజా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్‌రాజా రవితేజ- విఐ ఆనంద్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘డిస్కోరాజా’. ఇటీవలే ఈ చిత్రం మొదటి షెడ్యూల్ ముగిసింది. ప్రస్తుతం షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చాడు రవితేజ. సినిమా తదుపరి షెడ్యూల్ మే మూడోవారం నుండి నిర్వహిస్తారని సమాచారం. సైంటిఫిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న చిత్రంలో రవితేజ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. నబా నటేష్, పాయల్‌రాజ్‌పుత్ హీరోయిన్లు. ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రవి తాళ్లూరి నిర్మిస్తున్న చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. చిత్రంలో ప్రముఖ కోలీవుడ్ హీరో బాబీ సింహ విలన్ పాత్రలో నటిస్తుండగా, సునీల్ ముఖ్యపాత్రలో కనిపించనున్నాడు.