కార్తికేయ గుణ 369

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఆర్‌ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రానికి ‘గుణ 369’ టైటిల్ ఖరారైంది. స్ప్రింట్ ఫిలిమ్స్, జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రానికి అనిల్ కడియాల, తిరుమల్‌రెడ్డి నిర్మాతలు. అర్జున్ జంధ్యాల దర్శకుడు. దర్శకుడు మాట్లాడుతూ ‘ఇంతకుముందు ఒంగోలులో భారీ షెడ్యూల్ చేశాం. మళ్లీ 29నుంచి మే 15వరకు మరో భారీ షెడ్యూల్‌కు ప్లాన్ చేశాం. దీంతో ఒక సాంగ్ వినా సినిమా మొత్తం పూర్తవుతుంది. ఇప్పుడు హైదరాబాద్ పరిసరాల్లో షూటింగ్ చేస్తున్నాం. సినిమాలో హీరో పేరు గుణ. ‘369’ అంటే ఏంటనేది స్క్రీన్‌పైనే చూడాలి’ అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘రియల్ లవ్ ఇన్సిడెంట్స్‌తో బోయపాటి శిష్యుడైన అర్జున్ జంధ్యాల కథను అద్భుతంగా తయారు చేసుకున్నాడు. వినగానే ఇంప్రెస్ అయి వెంటనే ఓకే చెప్పాం. లవ్ యాక్షన్స్ ఎంటర్‌టైనర్ జోనర్‌లో ఉంటుంది. కచ్ఛితంగా యువతరాన్ని ఉర్రూతలూగించే సినిమా ఇది. హీరో కార్తికేయ క్యారెక్టరైజేషన్ ఆర్ ఎక్స్100, హిప్పీకన్నా విభిన్నంగా ఉంటుంది అన్నారు. హీరో కార్తికేయ మాట్లాడుతూ కొన్ని కథలు వినగానే నచ్చుతాయి. మళ్లీమళ్లీ గుర్తుకొస్తాయి. నలుగురితో పంచుకోవాలని అనిపిస్తాయి. నాకు అర్జున్ జంధ్యాల చెప్పిన కథ అలాంటిదే. వినగానే నచ్చింది. బెస్ట్ స్టోరీ టు టెల్ అనిపించింది. ఇప్పటిదాకా తీసిన రషెస్ చూసుకున్నాం. ప్రతి ఫ్రేమూ రియలిస్టిక్‌గా వచ్చింది. రియలిస్టిక్ చిత్రమిది అన్నారు.