మూడో బిగ్‌బాస్ కింగ్ నాగార్జున

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్‌బాస్ -మూడో సిరీస్‌కు యాంకర్‌ను సెట్ చేయడం స్టార్ మాకు పెద్ద గుదిబండగా మారింది. గత కొంతకాలంగా వెంకటేష్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, రానా అంటూ ఏవేవో పేర్లు వినిపించాయి. కానీ ఎవరు ఫైనల్ అవుతారో అంతుచిక్కని పరిస్థితి. చివరిగా సీన్లోకి కింగ్ నాగార్జున ఎంటరవుతున్నట్టు ప్రెష్ అప్‌డేట్. దాదాపు డీల్ ఓకె అయ్యిందని, అగ్రిమెంట్ లాంటి ఫార్మాలిటీస్ పూర్తయ్యాయన్న టాక్ వినిపిస్తోంది. రేపో ఎల్లుండో ట్రయిల్ షూట్ కూడా చేస్తారని అంటున్నారు. ఒకరకంగా నాగార్జున మంచి ఛాయిస్. మీలో ఎవరు కోటీశ్వరుడిని నడిపించిన తీరు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. సో బిగ్‌బాస్-3కి నాగ్‌కంటే బెటర్ ఆప్షన్ లేరనుకోవచ్చు. ఫస్ట్ సీజన్‌ని జూ.ఎన్టీఆర్ సక్సెస్ చేసినా, అనవసరమైన వివాదాలు, ఆర్మీ పేరుతో పార్టిసిపెంట్స్ చేసిన రచ్చవల్ల సెకెండ్ సీజన్ నానికి తలనొపిప్పిగా మారింది. కానీ కొంత అసంతృప్తి తనలో, ప్రేక్షకుల్లో ఇద్దరిలోనూ ఉంది. ఇవన్నీ బ్యాలెన్స్ చేయడానికి బిగ్‌బాస్ 3లో చాలా మార్పులే చేశారట. నాగార్జునలాంటి సీనియర్ హీరో అయితేనే ఈ ఒత్తిడిని తట్టుకుంటారని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. మరి కొద్దిరోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.