ఫ్యాక్షన్ లవ్‌స్టోరీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారీ అంచనాలమధ్య విడుదలైన ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ అనుకున్న విజయాన్ని అందించలేదు. ఇప్పుడు పవన్ చేసే తదుపరి చిత్రానికి సన్నాహాలు పూర్తికావచ్చాయి. పవన్‌కళ్యాణ్‌తో అప్పట్లో ‘ఖుషి’ వంటి సంచలన చిత్రాన్ని తెరకెక్కించిన ఎస్.జె.సూర్య దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. ఇప్పటికే స్క్రిప్ట్‌వర్క్ దాదాపు పూర్తికావచ్చింది. పవన్‌కళ్యాణ్, సూర్యల కాంబినేషన్‌లో రెండవ చిత్రంగావచ్చిన ‘కొమరం పులి’ ఘోర పరాజయాన్ని చవిచూసింది. మళ్లీ కొంత గ్యాప్ తరువాత వీరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో లవ్‌స్టోరీగా ఉంటుందని తెలిసింది. అప్పట్లో ‘బంగారం’ సినిమాతో ఫ్యాక్షన్‌ను టచ్ చేశాడు పవన్. మళ్లీ ఈసారి కూడా ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం తెరకెక్కనుండడం విశేషం. ఈనెల చివరిలో ఈ చిత్రం సెట్స్‌పైకి రానున్నదట. త్వరలోనే అధికారిక వివరాలు వెల్లడికానున్నాయి.