‘చాకొలెట్ బాయ్’ రజనీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘సూపర్ స్టార్’ రజనీకాంత్ కొత్త సినిమా విడుదలైతే ఇక- తమిళనాడులో ఆయన అభిమానులు కటౌట్ల ఏర్పాటుకు, పాలాభిషేకాలకు భారీగా డబ్బు ఖర్చు చేస్తూ హైరానా పడాల్సిన అవసరం ఉండదేమో! గాలన్ల కొద్దీ పాలను వృథా చేస్తున్నా తన అభిమానులను ఏమీ అనడం లేదన్న విమర్శల నుంచి ఇక ‘తలైవార్’ బయటపడొచ్చు! తన కటౌట్లకు అభిమానులు చేసే క్షీరాభిషేకాల కారణంగా రజనీ కొంతకాలంగా పలు న్యాయపరమైన వివాదాలను ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల నుంచి సూపర్‌స్టార్‌ను, ఆయన అభిమానులను గట్టెక్కించేందుకు చెన్నైలోని ఓ హోటల్ యజమాన్యం చాకొలెట్‌తో చేసిన రజనీ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. ఆరడుగుల ఎత్తు ఉన్న ఈ విగ్రహాన్ని చూసేందుకు రజనీ అభిమానులు ఎగబడుతున్నారు. రజనీ సినిమా విడుదలైనపుడు ఇలాంటి చాకొలెట్ విగ్రహాలను ఏర్పాటు చేస్తే థియేటర్ల వద్ద భారీ కటౌట్లు, పాలాభిషేకాల ఆర్భాటం అవసరం ఇక ఉండదేమో! కాగా, శిలావిగ్రహాలకే భద్రత కల్పించడం కష్టంగా ఉన్న ఈ రోజుల్లో ‘చాకొలెట్ విగ్రహాలు’ పెడితే వాటిని ఎవరైనా ‘కొరుక్కుని చప్పరించి తినకుండా’ చూడాల్సిన బాధ్యత ఎవరు తీసుకుంటారన్న అనుమానాలు అపుడే మొదలయ్యాయి. ఈ కొత్తరకం విగ్రహాలను తమిళనాట ఎక్కడపడితే అక్కడ పెడితే ఇక- రజనీని అంతా ‘చాకొలెట్ బోయ్’ అంటారేమో..!