టర్కీలో సాహసం...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగచైతన్య, మంజిమామోహన్ జంటగా ద్వారకా క్రియేషన్ పతాకంపై గౌతమ్‌వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో మిర్యాల రవీందర్ రెడ్డి రూపొందిస్తున్న చిత్రం ‘సాహసం శ్వాసగా సాగిపో.’ ఈ చిత్రానికి సంబంధించిన పాటల చిత్రీకరణ టర్కీలో జరుగుతోంది. ఈ సందర్భంగా నాగచైతన్య మాట్లాడుతూ, ఈనెల 20వరకు పాటల చిత్రీకరణ, క్లైమాక్స్ చిత్రీకరణ జరుపుతారనీ, దానితో సినిమా పూర్తిఅవుతుందని తెలిపారు. ఈనెల చివరి వారంలో ఆడియోను, మే చివరి వారంలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలిపారు. నిర్మాత రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, టర్కీలో ‘ఎల్లిపోమాకే’ అనే పాటను షూట్ చేస్తున్నామనీ, ఈ పాట చిత్రానికి హైలెట్‌గా నిలుస్తుందని అన్నారు. ఈ చిత్రంలో చైతన్య లుక్స్ డిఫెరెంట్‌గా ఉంటాయనీ, రెహమాన్ అద్భుతమైన పాటలను ఈ సినిమాకోసం కంపోజ్ చేసారనీ, దర్శకుడు గౌతమ్‌వాసుదేవ్ మీనన్ అన్నారు. మా ముగ్గురి కలయికలో మరో సూపర్‌హిట్‌గా ఈ చిత్రం నిలుస్తుందని ఆయన అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: డాన్‌మాక్ ఆర్దర్, ఎడిటింగ్: ఆంటోనీ, సంగీతం: ఎ.ఆర్.రెహమాన్, రచన, సమర్పణ: కోన వెంకట్, నిర్మాత: మిర్యాల రవీందర్‌రెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం- గౌతమ్ వాసుదేవమీనన్.