కలి పాటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గౌతమ్, ఉదయ్, భవ్యశ్రీ, అంకిత ప్రధాన పాత్రల్లో కృష్ణ మామిడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కలి’. ఈ చిత్రంలోని పాటలు గురువారం హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. ప్రముఖ సీనియర్ దర్శకుడు సాగర్ సీడీలను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఈమధ్య హారర్ సినిమాల క్రేజ్ ఎక్కువైందని, తెలుగులో ఎక్కువగా ఈ తరహా సినిమాలే రూపొందుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయన్నారు. తప్పకుండా ఈ సినిమా కూడా మంచి విజయం సాధించాలని అన్నారు. దర్శకుడు మామిడి కృష్ణ మాట్లాడుతూ, కొత్తవారితో తెరకెక్కించిన సినిమా ఇదని, హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా రెండు ప్రేమజంటలు వీకెండ్‌లో ఎంజాయ్ చేయడానికి అడవికి వెళతారని, అక్కడ వీరికి ఎదురైన సమస్యలు ఏంటి అనే ఆసక్తికర కథాంశంతో సినిమా చేశానని, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయని, మే మొదటివారంలో చిత్రాన్ని విడుదల చేస్తామన్నారు. ఆర్.కె.గౌడ్ మాట్లాడుతూ, ఈమధ్య ప్రభుత్వంతో కూడా మాట్లాడామని, ఐదో షోను చిన్న సినిమాలకి కేటాయిస్తుందని, అలాంటి అవకాశాన్ని ఈ సినిమా వినియోగించుకుని మంచి విజయం సాధించాలన్నారు. ఈ చిత్రానికి సంగీతం:విజయ్ బొల్లా, కెమెరా:సత్యానంద్, ఎడిటింగ్:మహేంద్రనాధ్, నిర్మాత:అనూరాధ.ఎం., దర్శకత్వం:మామిడి కృష్ణ.