వైష్ణవ్ తేజ్.. జాలరి కాదు ఉప్పెన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెగా ఫ్యామిలీ కొత్త హీరో సినిమాకి ఎట్టకేలకు టైటిల్ కన్ఫర్మ్ అయ్యింది. దర్శకుడు సుకుమార్ వద్ద అసిస్టెంట్‌గా పని చేసేని బుచ్చిబాబు, సాయితేజ్ తమ్ముడు వైష్ణవ్‌తేజ్‌ను హీరోగా పరిచయం చేస్తూ చిత్రం తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ‘ఉప్పెన’ టైటిల్ ఖరారు చేస్తూ చిత్రబృందం ప్రకటించింది. ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటున్న చిత్రానికి సంబంధించి ఆమధ్య విడుదల చేసిన వైష్ణవ్ ప్రీలుక్‌కు మంచి రెస్పాన్స్ రావడం తెలిసిందే. ప్రీలుక్‌ను దృష్టిలో పెట్టుకుని సినిమాకు ‘జాలరి’ టైటిల్ పెడుతున్నట్టు ఆమధ్య ఊహాగానాలు చెలరేగాయి. వాటిని కొట్టిపారేస్తూ -చిత్రబృందం అసలు టైటిల్‌ను ప్రకటించింది. ‘కథకు సరిపోయే టైటిల్ కోసం చాలారోజులు ఆలోచించాం. చివరకు ‘ఉప్పెన’ సరిపోతుందని కన్ఫర్మ్ చేసుకున్నాం. ఈనెలలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’ అని చిత్రబృందం ప్రకటించింది. మైత్రీమూవీ మేకర్స్‌తో కలిసి సుకుమార్ నిర్మిస్తోన్న చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తుంటే, తమిళస్టార్ విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషిస్తున్నాడు.