అదే లవ్.. అదే ఫీల్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పదిహేనేళ్ల క్రితం ‘్ఫల్ మై లవ్’ అంటూ ఆన్‌స్క్రీన్‌పై హీరోయిన్‌తో, ఆఫ్‌స్క్రీన్‌లో యూత్‌తో ఓ ఆటాడుకున్నాడు హీరో అల్లు అర్జున్. లవ్‌కు కొత్త డైమన్షన్ చూపిస్తూ సుకుమార్ తెరకెక్కించిన సినిమా ఆర్య. బన్నీ కెరీర్‌లో ఓ బ్లాక్‌బస్టర్. అలాంటి ఆర్య థియేటర్లకు వచ్చి పదిహేనేళ్లయిన సందర్భంగా -మరోసారి తన లవ్ ఫీల్‌ను ఎక్స్‌పోజ్ చేశాడు బన్నీ. ఫీల్ మై లవ్‌ను మరోసారి సోషల్ మీడియాలో గుర్తు చేస్తూ -‘ఆ ఫీల్ ఇప్పటికీ ఫీలవుతున్నా. ఆ లవ్ ఎప్పటికీ నన్ను వదలదు. నా కెరీర్‌లో ఆర్య ఓ మ్యూజికల్ హిట్. నిజానికి లైఫ్‌నే మార్చేసిన ఆర్య వచ్చి పదిహేనేళ్లయిందని అంటుంటే నమ్మబుద్ధికావడం లేదు. సుక్కూ, దిల్‌రాజు, దేవీశ్రీ, రత్నవేలు... ఇప్పటికీ అదే ఆదరణ చూపుతున్న అభిమానులు. అందరికీ కృతజ్ఞతలు’ అంటూ ఓ పోస్టర్‌ను ట్వీట్ చేశాడు బన్నీ. బ్లాక్‌బస్టర్ సినిమా ఆర్యకు -సుక్కూ, బన్నీలు 2009లో సీక్వెల్ చేశారు. ఆర్య-2లోనూ బన్నీని మరో రేంజ్‌లో చూపించాడు దర్శకుడు సుకుమార్. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో మూడో ప్రాజెక్టూ ఓకే అవ్వడం తెలిసిందే. ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. హ్యాట్రిక్ సక్సెస్‌పై ఇద్దరూ ఫోకస్డ్‌గానే ఉన్నారు. ప్రస్తుతం బన్నీ -త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ప్రాజెక్టుతో బిజీగా ఉన్నాడు.