షూటింగ్‌లో ఈడు గోల్డెహె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటీవలే ‘కృష్ణాష్టమి’ సినిమాతో అలరించిన సునీల్ ప్రస్తుతం జక్కన్న చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాతోపాటు ‘బిందాస్’ ఫేమ్ వీరూ పోట్ల దర్శకత్వంలో ‘ఈడు గోల్డెహె’ చిత్రం ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈనెల 28 నుండి ప్రారంభం కానుంది. ‘బిందాస్’, ‘రగడ’ వంటి చిత్రాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వీరూ పోట్ల సునీల్ కోసం పవర్‌ఫుల్ కథను రెడీ చేశాడు. టైటిల్‌లోనే ఆసక్తిని రేకెత్తిస్తున్న ఈ చిత్రంలో సునీల్ విభిన్నంగా కనిపిస్తాడని తెలిసింది. ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ తనయుడు సాగర్ మహతి సంగీతం అందించే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.