సంపాదనకు ఏది దారి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం సమాజం డబ్బు చుట్టూ తిరుగుతోంది. డబ్బు సంపాదించే దారి మంచిదైతే ఎలా ఉంటుంది. చెడ్డదైతే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది తెలియాలంటే -ఎంతవారలైన చిత్రం చూడాల్సిందే అంటున్నారు నిర్మాత జి సీతారెడ్డి. రామదూత ఆర్ట్స్ పతాకంపై ఆయన నిర్మిస్తున్న చిత్రం ఎంతవారలైన. అద్వైత్, జహీదా శ్యామ్, అలోక్‌జైన్, సీతారెడ్డి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. గురు చిందేపల్లి దర్శకత్వంలో రూపొందిన సినిమా ఈనెల 17న విడుదల కానుంది. ఈ సందర్భంగా సీతారెడ్డి మీడియాతో మాట్లాడారు.
‘నిర్మాణరంగ వ్యాపారంలో స్థిరపడిన నాకు చిన్నప్పటి నుంచీ సినిమాలంటే పిచ్చి. చిన్ననాటి మిత్రుడైన గురు చిందేపల్లిని ఓ సందర్భంలో రెండేళ్ల క్రితం కలిశాను. ఆ టైంలో అతను చెప్పిన ఈ కథ బాగా నచ్చింది. ఎప్పటినుంచో సినిమాల్లోకి రావాలనే కోరికతోవున్న నేను, స్నేహితుడికి హెల్ప్ చేసినట్టు ఉంటుందన్న ఉద్దేశంతో చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టా. ఈ సినిమాలో ఎస్పీ పాత్రకు దర్శకుడు నన్ను ఎంపిక చేసుకున్నాడు. యాక్టింగ్ అనుభవం లేకున్నా, దర్శకుడు ఇచ్చిన సూచనల మేరకు క్రమశిక్షణతో పాత్ర పోషించా. ఎంతవారలైన అన్నది సస్పెన్స్ థ్రిల్లర్. డబ్బు చుట్టూ తిరిగే కథే -హీరో. చనిపోయే చివరి సమయంలో ఓ వ్యక్తి పడే వేదన ఎలా ఉంటుందో ఆసక్తికరంగా చిత్రీకరించాం. దర్శక స్నేహితుడిని నమ్మినందుకు, అద్భుతంగా చిత్రాన్ని తెరకెక్కించాడు గుర చిందేపల్లి. టెక్నికల్‌గా సినిమా బాగా వచ్చింది. సంగీత దర్శకుడు సుక్కు మంచి బాణీలు అందించాడు. ఆడియన్స్‌ని సినిమా ఆకట్టుకుంటుందని నమ్ముతున్నా’ అన్నారు. చిత్రాన్ని సొంతంగానే విడుదల చేయబోతున్నామని, ఇకపై ఆర్టిస్ట్‌గా, నిర్మాతగా కొనసాగుతానని సీతారెడ్డి వెల్లడించారు.