ఈసారి నీటిపైన....

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవతార్.. 2009లో వచ్చిన హాలీవుడ్ సినిమా సంచలన విజయాన్ని అందుకుని ప్రేక్షకులను విస్మయపరిచింది. హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించాడు. సహజ వనరుల కోసం మనుషులు పండోరా గ్రహానికి వెళ్లడం, అక్కడ నావి అనే జాతికి చెందిన జీవులతో యుద్ధం, సహాయం చేయడంలాంటి ఆసక్తికర మలుపులతో కథ సాగుతుంది. కామెరూన్ అద్భుత ఆలోచనలకు ప్రతిరూపంగా తెరకెక్కిన సినిమాకు సీక్వెల్ రూపొందుతోన్న విషయం తెలిసిందే. నిజానికి ఈ సినిమాకు నాలుగు సీక్వెల్స్ ఉంటాయని అప్పట్లోనే చెప్పాడు దర్శకుడు కామెరూన్. అందులో రెండో భాగం అవతార్ 2ని 2021 డిసెంబర్ 17న విడుదల చేస్తున్నట్టు సోషల్ మీడియాలో ప్రకటించాడు. ఈ రెండో భాగానికి అవతార్.. ది వేవ్ ఆఫ్ వాటర్ అనే పేరు ఖరారు చేసేలా ఉన్నారు. అవతార్ పార్ట్ 1 సినిమాను 1648 కోట్లతో తెరకెక్కించగా, ఆ సినిమా ఏకంగా 20,455 కోట్లను వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద పెద్ద దుమారమే రేపింది. ఇపుడు అవతార్ రెండోభాగాన్ని దాదాపు 2వేల కోట్లతో తెరెకెక్కిస్తున్నారు. జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్‌గా తెరకెక్కించే సినిమా కూడా హాలీవుడ్ బాక్సాఫీస్‌పై పెద్ద దుమారం రేపడం ఖాయమంటున్నాయి ట్రేడ్ వర్గాలు.