నాగకన్య వచ్చేస్తోంది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గతంలో నటుడు కమల్‌హాసన్ తమిళంలో చేసిన నియా చిత్రం ఘన విజయం సాధించింది. దానికి సీక్వెల్‌గా తమిళంలో నియా-2, తెలుగులో నాగకన్య పేరిట చిత్రాన్ని రూపొందించారు. జర్నీ, రాజా రాణి చిత్రల ఫేమ్ జై హీరోగా, వరలక్ష్మీ శరత్‌కుమార్, రాయ్‌లక్ష్మి, కేథరిన్ థ్రెసా ప్రధాన పాత్రల్లో ఎల్ సురేష్ దర్శకత్వంలో రూపొందించిన చిత్రాన్ని మే 10న విడుదల చేస్తున్నారు. తెలుగు హక్కులను దక్కించుకున్న కెఎస్ శంకర్ రావు మాట్లాడుతూ వేసవి కానుకగా చిత్రాన్ని మే 10న తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేశామన్నారు. చిత్రంలోని గ్రాఫిక్స్ పిల్లలు, పెద్దల్ని అలరిస్తాయని, ఖర్చు విషయంలో రాజీపడకుండా సీజీ వర్క్‌కి ప్రాధాన్యత ఇచ్చామన్నారు. హారర్ కథాంశంతో ఆద్యంతం ఆకట్టుకునే విధంగా దర్శకుడు చిత్రించిన విధానం ప్రశంసనీయమన్నారు. సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుందన్న నమ్మకం ఉందన్నారు.