అఖిల్ ఫోర్ కొడతాడా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మరో లవ్ స్టోరీతో అఖిల్ అక్కినేని తన లక్ పరీక్షించుకోడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటి వరకూ చేసిన సినిమాల్లో ఒక్కటీ హిట్టందుకోకపోవడంతో -అఖిల్ కెరీర్ నిరాశగా సాగుతోన్న విషయం తెలిసిందే. హ్యాట్రిక్ వైఫల్యాల నుంచి బయటపడేందుకు మరో లవ్ స్టోరీతో వస్తానని అఖిల్ స్పష్టం చేయడం తెలిసిందే. అఖిల్ నాల్గవ చిత్రం కోసం అక్కినేని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్న తరుణంలో -వచ్చే నెల రెండోవారం నుంచి కొత్త కథతో సెట్స్‌పైకి వెళ్లేందుకు అఖిల్ సమాయత్తమవుతున్నట్టు సమాచారం. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించనున్న సినిమాను గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం లక్కీ గాళ్ రష్మిక మండన్నను హీరోయిన్‌గా ఎంపిక చేసుకున్నట్టు వస్తోన్న వార్తలను చిత్రబృందం ధ్రువీకరించలేదు. హీరోయిన్ ఎంపికపై ఇంకా కసరత్తు జరుగుతోందనే అంటున్నారు. లవ్ స్టోరీస్ స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకుంటున్న గోపీసుందర్‌ను మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తోంది. వరుస ఫ్లాపులు రుచి చూసిన అఖిల్, నాల్గవ ప్రాజెక్టు నుంచీ కెరీర్‌ను కొత్తగాడిలో పెట్టాలన్న కసితో ఉన్నట్టు తెలుస్తోంది.