రొమాంటిక్ హిప్పీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్‌ఎక్స్ 100 తరువాత భారీ అంచనాల మధ్య రూపుదిద్దుకుంటున్న కార్తికేయ చిత్రం -హిప్పీ. టీఎన్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో కార్తికేయతో దిగంగనా సూర్యవంశీ, జబ్బాసింగ్‌లు జోడీకట్టారు. తాజాగా విడుదలైన ట్రైలర్‌లో కార్తికేయ మళ్లీ మాన్లీ అప్పియరెన్స్‌లోనే దర్శనమిచ్చాడు సిక్స్ ప్యాక్ షేప్, జులపాల్లాంటి హిప్పీ జుట్టుతో స్టయిలిష్ లుక్‌లో ఆకట్టుకున్నాడు. ‘ఒకమ్మాయి మనల్ని లవ్ చేస్తే.. ప్యారడైజ్ బిగిన్స్’ అంటూనే ‘అదే అమ్మాయి తిరిగి మనల్ని లవ్ చేయడం స్టార్ట్‌చేస్తే మై ప్యారడైజ్ లాస్ట్’ అంటూ కార్తికేయ తన పాత్రకు సంబంధించిన ఆటిట్యూడ్‌ని ప్రజెంట్ చేయడం బావుంది. ఇద్దరమ్మాయిల మధ్య హిప్పీ పాత్రలో కార్తికేయ కొత్తకోణాన్ని చూపించడం కనిపించింది. ‘అమ్మాయిల్ని చందమామతో ఎందుకు పోలుస్తారో తెలుసా. వాళ్లు ఒక్కో రోజు ఒక్కోలా ఉంటారు’ అంటూ కీలక పాత్ర పోషిస్తున్న జెడీ చక్రవర్తి పేల్చిన సెటైర్ హైలెట్‌గా నిలిచింది. లవ్, యాక్షన్, ఎమోషన్, రొమాన్స్, ఫన్ సీన్స్‌తో ట్రైలర్‌ను కట్ చేయడం బావుంది. తెలుగు, తమిళంలో విడుదలకానున్న హిప్పీతో అటు తమిళంలోనూ తన మార్కెట్ విస్తృతం అవుతుందని కార్తికేయ భావిస్తున్నాడు. హిప్పీ -కార్తికేయ కెరీర్‌ని ఎంత హైట్స్‌కు తీసుకెళ్తుందో చూడాలి.