బొమ్మరిల్లు తరువాత కొత్త ఊపిరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జున, కార్తి, తమన్నా ముఖ్యపాత్రల్లో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో పి.వి.పి సినిమా పతాకంపై ఇటీవలే విడుదలై అందరి మన్ననలు అందుకుంటోన్న చిత్రం ‘ఊపిరి’. ఈ సినిమా థాంక్స్ మీట్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న దాసరి నారాయణరావు మాట్లాడుతూ, 15 సంవత్సరాల క్రితం ‘బొమ్మరిల్లు’ చిత్రం చూశానని, ఆ సినిమా తరువాత గొప్ప సినిమా ఏదైనా చూసి వుంటే అది ‘ఊపిరి’ మాత్రమేనని అన్నారు.
తెలుగువాళ్లు మంచి సినిమాలు తీయరని, హిందీ మలయాళ చిత్రాలతో పోటీపడి సినిమాలు చేయరని బాధపడేవాడినని, అలాంటి సమయంలో నిజంగా ఆ బాధను మర్చిపోయేలా ఈ సినిమా చేసిందన్నారు. ఇలాంటి సినిమాను గట్స్‌తో తీసిన నిర్మాతను అభినందిస్తున్నానని, అలాగే ఈ సినిమా చేయడానికి సిద్ధపడ్డ నాగార్జునని అభినందించకుండా ఉండలేకపోతున్నానన్నారు. నాగార్జున కేవలం కళ్లతోనే నటించారని, పరిణితి చెందిన నటులే ఇలా కళ్లతో నటించి ఆకట్టుకుంటారని, సినిమాలో కార్తి ఎంపిక కూడా పర్‌ఫెక్ట్ అని అన్నారు.
ముఖ్యంగా ఇంత మంచి చిత్రాన్ని తెరకెక్కించిన వంశీని అభినందిస్తున్నానన్నారు. నాగార్జున మాట్లాడుతూ, ఇప్పటివరకు ఎన్నో కొత్త ప్రయోగాలు చేశానని, సాహసం నేనైతే, శ్వాస నా అభిమానులని, వారి అండ లేకుంటే ఇలాంటి సినిమాలు చేయగలిగేవాణ్ణి కాదని, ఏమిచ్చి వారి రుణం తీర్చుకోవాలో తెలియడం లేదన్నారు.
ఇలాంటి భిన్నమైన సినిమాల్ని మరిన్ని చేసి మిమ్మల్ని ఆనందింపచేస్తాను. ఇదే సాహసంతో హాథిరామ్ బాబా సినిమా చేస్తున్నానని, ఏ సినిమాకైనా నిర్మాతే ముఖ్యమని, ఈ సినిమాపై ఇంత నమ్మకం పెట్టి గట్స్‌తో సినిమాను నిర్మించిన పివిపికి హాట్సప్ చెప్పాలన్నారు. దర్శకుడు వంశీ మాట్లాడుతూ, తన లైఫ్‌లో మర్చిపోలేని అనుభూతి ఇదని, తన కెరీర్ ఇక్కడవరకూ సాగడానికి కారణమైన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. మొదటిరోజే కథ విన్నప్పుడు భయాన్ని నమ్మకంగా మార్చిన నాగార్జునకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని, కార్తి కూడా ఎంతో సపోర్టు అందించాడని అన్నారు.