ఆకట్టుకున్న కల్కి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా కల్కి. తెలుగు ప్రేక్షకులకు అ! వంటి ప్రయోగాత్మక, కొత్త తరహా చిత్రాన్ని అందించిన ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్న రెండో చిత్రమిది. శివానీ శివాత్మిక సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి.కల్యాణ్ నిర్మిస్తున్నారు. చిత్రీకరణ దాదాపు పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. గురువారం విడుదలవుతున్న సూపర్‌స్టార్ మహేష్ బాబు మహర్షి సినిమాతో సినిమా కమర్షియల్ ట్రైలర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్, టీజర్‌కు అద్భుత స్పందన లభించింది. కల్కి ఎంత కొత్తగా ఉండబోతుంది అనేది టీజర్‌లో చూపించే ప్రయత్నం చేశాం. ప్రేక్షకులంతా ట్రైలర్ చూసి ఆనందిస్తున్నారు. ఇది కమర్షియల్ ట్రైలర్ మాత్రమే. సినిమా విడుదలకు ముందు కల్కి థియేట్రికల్ ట్రైలర్ కూడా విడుదల చేస్తాం అన్నారు.