నా పేరు రాజా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమోఘ్ ఎంటర్‌ప్రైజెస్ పతాకంపై రాజ్ సూరియన్ హీరోగా ఆకర్షిక, నస్రీన్ హీరోయిన్లుగా అశ్విన్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం -నా పేరు రాజా. రాజ్ సూరియన్, ప్రభాకర్ రెడ్డి, కిరణ్ రెడ్డి నిర్మాతలు. తెలుగు, కన్నడ భాషల్లో రూపొందుతోన్న చిత్రం లోగో మరియు టీజర్ లాంచ్ ఫిలిం ఛాంబర్‌లో జరిగింది. హీరో రాజ్ సూరియన్ మాట్లాడుతూ- నా పేరు రాజా నా మూడో సినిమా. దర్శకుడు అశ్విన్ అద్భుతమైన కథతో తెరకెక్కించాడు. షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ జరుగుతున్నాయి. రెండు నెలల్లో సినిమా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అన్నారు. నిర్మాత కిరణ్‌రెడ్డి మాట్లాడుతూ- మనాలి, హైదరాబాద్, కేరళలో షూటింగ్ పూర్తిచేసాం. ఇందులో లవ్, కామెడీ, యాక్షన్ అంశాలన్నీ మెండుగా వున్నాయి అన్నారు. దర్శకుడు అశ్విన్ కృష్ణ మాట్లాడుతూ- దర్శకుడిగా ఇది నా తొలి సినిమా. ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్. హీరో క్యారెక్టర్‌లో త్రీ షేడ్స్ వుంటాయి. అవి ఏంటనేవి స్క్రీన్‌పైనే చూడాలి. అలాగే ఇద్దరు హీరోయిన్ల పాత్రలు చాలా డిఫరెంట్‌గా వుంటాయి. తెలుగు, కన్నడంలో రూపొందుతోన్న బైలింగ్వల్ ఫిలిం ఇది. లవ్, కామెడీ, ఎమోషన్, యాక్షన్‌తో ఈ సినిమాను తెరకెక్కించామన్నారు.