టైటానిక్‌ని ముంచేశారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టైటానిక్ మళ్లీ మునిగిందంటున్నాడు ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్. ఈసారి ప్రమాదవశాత్తూ కాదు, అవెంజర్స్: అండ్ గేమ్ టైటానిక్‌ను ముంచేసిందని చమత్కరిస్తున్నాడు కామెరూన్. మార్వెల్ సంస్థ నిర్మించిన ‘ఎండ్‌గేమ్’ ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల దుమారం రేపడం తెలిసిందే. అటు అవతార్, ఇటు టైటానిక్ సినిమా రికార్డులను దాటెళ్లిపోయింది. ఈ సందర్భంలో ఎండ్‌గేమ్ విజయాన్ని ఉద్దేశిస్తూ కామెరూన్ ఓ ట్వీట్ వదిలాడు. ‘అప్పడు టైటానిక్ ఓడను ఓ ఐస్‌బర్గ్ ముంచేసింది. ఇప్పుడు టైటానిక్ రికార్డుల్ని కెవిన్ ఫీజ్ (ఎండ్‌గేమ్ నిర్మాత, మార్వెల్ సంస్థ అధినేత) ముంచేశాడు. లైట్‌స్మార్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ క్రూ మొత్తం మీ విజయానికి లేచి నిలబడి శాల్యూట్ చేస్తోంది. సినీ పరిశ్రమ సజీవంగానే కాదు, బహు గొప్పగా ఉందన్న విషయాన్ని మీరంతా నిరూపించారు’ అంటూ ట్వీట్ చేశాడు. అంతేకాదు, టైటానిక్‌ను అవెంజర్స్ ముంచేస్తున్నట్టున్న డిజైన్‌ను విడుదల చేసి కామెరూన్ తన గొప్పతనాన్ని చాటుకున్నాడు. ఎండ్‌గేమ్ వసూళ్ల దుమారం ఇప్పటికే సినీ ప్రపంచానికి ఫీవర్ తెప్పించింది. 2.188 బిలయన్ డాలర్లకు పైగా ఈ సినిమా వసూళ్లు ఉన్నట్టు అంచనా. అలాగే అత్యంత వేగంగా 2 బిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరిన చిత్రంగా ‘అవతార్’ సృష్టించిన రికార్డులనూ బద్దలుకొట్టింది. అవెంజర్స్ సిరీస్‌లో చివరి చిత్రంగా వచ్చిన ఎండ్‌గేమ్‌లో భావోద్వేగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో సినిమా చూస్తూ ఏడ్చేశామంటూ ప్రేక్షకులు తమ గొంతు వినిపించటం గొప్ప విశేషం.