మరో క్రేజీ బయోపిక్‌లో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్ నటి విద్యాబాలన్‌కు మొదటినుంచి విభిన్న కథా చిత్రాలు ఎంచకునే అలవాటు వుంది. ఒకవైపు పక్కా కమర్షియల్ చిత్రాలలో నటిస్తూనే మరోవైపు ఆర్టిస్టిక్ టచ్ వున్న సినిమాల్లో కూడా నటించింది. బయోపిక్‌ల ట్రెండ్ ఊపందుకోకముందే సిల్క్ స్మిత బయోపిక్‌లో నటించిన విద్య, ప్రస్తుతం ఒక చిత్రంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాత్రలో నటిస్తోంది. తాజాగా మరో బయోపిక్‌కు పచ్చజెండా ఊపింది. గణిత మేధావి.. హ్యూమన్ కంప్యూటర్‌గా పేరుతెచ్చుకున్న శకుంతలాదేవి జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. శకుంతలాదేవి టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అను మీనన్ దర్శకత్వం వహిస్తున్నారు. విక్రమ్ మల్హోత్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవికి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ఫిలిం మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించిన విద్యాబాలన్ , మ్యాథ్స్ జీనియర్ శకుంతలాదేవి పాత్రలో నటించటం ఎగ్జైటింగ్‌గా ఉంది అంటూ ట్వీట్ చేశారు.