లీసా వస్తోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్నో మంచి చిత్రాలతో నటిగా ప్రూవ్ చేసుకున్న యువ కథానాయకి అంజలి మరో వైవిధ్యమైన పాత్రలో నటించిన చిత్రం లీసా త్రీడి. వీరేష్ కాసాని సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్.కె.పిక్చర్స్ ద్వారా సురేష్ కొండేటి విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ తమ అనుభవాలను పంచుకున్నారు. చిత్ర సమర్పకులు కాసాని వీరేశ్ మాట్లాడుతూ- గతంలో వచ్చిన హారర్ చిత్రాలకు భిన్నంగా ఈ సినిమా ఉంటుందన్నారు. చిత్ర నిర్మాత సురేష్ కొండేటి మాట్లాడుతూ- గతంలో షాపింగ్‌మాల్, జర్నీ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలను ఆదరించిన ప్రేక్షకులు లీసా త్రీడిని ఆదరించాలని కోరారు. డిజిటల్ రూపంలో త్రీడిలో విడుదలవుతున్న మొట్టమొదటి హారర్ చిత్రమిది. మే 24న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం అన్నారు. చిత్ర దర్శకుడు రాజు విశ్వనాధ్ మాట్లాడుతూ - టైటిల్ రోల్‌లో అంజలి ఆ పాత్రకి న్యాయం చేసిందని చెప్పాలి. సామ్ జోన్స్ ఇందులో మంచి పాత్ర వేశాడు. ఇక మకరంద్ దేశ్‌పాండే నటనకు అందరూ ఆశ్చర్యపోయారు. బ్రహ్మానందం లాంటి వ్యక్తిని డైరెక్ట్ చెయ్యడం నా అదృష్టం. నటి సలీమా రెండు దశాబ్దాల క్రితం తెలుగు, కన్నడలో హీరోయిన్‌గా చేసింది. ఆమెను ఈ చిత్రంలో నటించమని అడగ్గానే వెంటనే ఒప్పేసుకుంది అన్నారు.