ముసుగుల వెనుక మళ్లీ రొమాన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంటెంట్‌వున్న చిత్రాలకు పెద్ద బడ్జెట్ అవసరం లేదని ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, ఒక క్రిమినల్ కథలాంటి చిత్రాలతో నిరూపించిన పి సునీల్ కుమార్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం రొమాంటిక్ క్రిమినల్స్. ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, ఒక క్రిమినల్ ప్రేమకథ చిత్రాలకు సీక్వెల్‌గా రూపొందుతున్న చిత్రాన్ని ఎక్కిలి రవీంద్రబాబు, బి బాపిరాజు నిర్మిస్తున్నారు. విచ్చలవిడితనం, దిగజారుతున్న మానవ విలువలు, ఒంటరితనాన్ని పెంచుతూ మత్తువైపు మళ్లిస్తున్న పరిస్థితులు, ఇంటర్నెల్ అశ్లీలతలను ఇందులో చూపించారు. ఇంజనీరింగ్ స్టూడెంట్‌గా మనోజ్ నందం, అతన్ని ఇష్టపడే సీనియర్ స్టూడెంట్‌గా అవంతిక, డ్రగ్ పెల్లర్‌గా వినయ్, నైన్త్ స్టూడెంట్‌గా వౌనిక, కొత్తగా పెళ్లైన గృహణిగా దివ్య నటించారు. సన్నితమైన అంశాల్ని బోల్డ్ చూపించే ముసుగులు వేసుకున్న అమ్మాయిల కథ ఇది. నిర్మాత బి బాపిరాజు మాట్లాడుతూ ముసుగుల వెనుకవున్న ముగ్గురు అమ్మాయిల రహస్యాన్ని ఆద్యంతం ఆసక్తికరంగా తీర్చిదిద్దాం. వ్యసనాలు ఏమైనా వాటి పర్యావసానాలు తీవ్రంగా ఉంటాయనే పాయింట్‌ని వినోదం పాళ్లు తగ్గకుండా దర్శకుడు పి సునీల్‌కుమార్ రెడ్డి తెరకెక్కించారు. సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ ఆకట్టుకుంటుంది. త్వరలోనే విడుదల తేదీ వెల్లడిస్తామన్నారు. దర్శకుడు సనీల్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ మొదటి రెండు చిత్రాలను మించిన వినోదాన్ని ఈ చిత్రంలో డిజైన్ చేశామన్నారు. ఎస్‌వి శివరామ్ సినిమాటోగ్రఫీ హైలెట్ అవుతుందన్నారు. విశాఖ, అరకులోని అందాలేకాకుండా గంజాయి తోటల్లో పోలీసుల దాడి చేసే సన్నివేశాలను చక్కగా చిత్రీకరించామని అన్నారు.