అరకు రోడ్డులో...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామ్‌శంకర్, నికిషాపటేల్ జంటగా వాసుదేవ్ దర్శకత్వంలో మేకా బాలసుబ్రహ్మణ్యం, సురేష్ వర్మ ఇందుకూరి, నక్కా రామేశ్వరి సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘అరకు రోడ్డులో’. ఈ చిత్రానికి సంబంధించిన కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్నాయి. ఈ సందర్భంగా దర్శకుడు వాసుదేవ్ మాట్లాడుతూ, ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను విడుదల చేస్తే మంచి ఆదరణ లభిస్తోందని, పూర్తికావస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన కథ యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో సాగుతుందని, అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్‌తో రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. యాక్షన్ తరహాలో సాగే థ్రిల్లర్ మూవీగా రూపొందిస్తున్న ఈ చిత్రంలో పాత్రలన్నీ సరికొత్తగా వుంటాయని, ఈ నెల చివరిలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాతలు తెలిపారు. వాసుదేవ్ చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమాను రూపొందించామని, ఒకవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా జరుపుతున్నామని వారు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం:రాహుల్‌రాజ్, వాసుదేవ్, కెమెరా:జగదీష్ చీకటి, ఎడిటింగ్:మార్తాండ్ కె.వెంకటేష్, రచన, దర్శకత్వం:వాసుదేవ్.