అదే పదివేలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఆహార్యం గొప్పది కాకున్నా ఆర్టిస్ట్‌గా తనను స్వీకరించడమే పదివేలు. అందుకు అందరికీ ధన్యవాదాలు’ అంటున్నారు అల్లరి నరేశ్. కామెడీ హీరోగా ఎన్నో హిట్లందుకుని, ప్రతిభ కలిగిని నటుడిగా అనేక చిత్రాలో నిరూపించుకున్న నరేశ్ -కొంతకాలంగా వరుస ఫ్లాపులతో విసిగిపోయాడు. దీంతో సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చాడు. గ్యాప్ తరువాత చేసిన చిత్రమే -మహర్షి. మహేశ్‌బాబు, పూజా హెగ్దెలు హీరో హీరోయిన్లుగా వంశీ పైడిపల్లి తెరకెక్కించిన మహర్షి సినిమా విడుదలైంది. ప్రధాన పాత్రలకు బలాన్ని చేకూర్చే కీలక పాత్రలో కనిపించిన నరేశ్, ఆడియన్స్ నుంచి మంచి ప్రశంసలు అందుకుంటున్నాడు. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. ‘తొలి సినిమా ‘అల్లరి’లో నా పాత్ర పేరు రవి. ఇప్పుడు మహర్షి చిత్రంలోనూ ‘రవి’ పాత్రకు మంచి ప్రశంసలు రావడం హ్యాపీగా ఉంది. పదిహేడేళ్ల క్రితం అందరి కుర్రాళ్లలాగే నేనూ గమ్యం వెతుక్కుంటూ అడుగులేశాను. నిలదొక్కుకోగలనో లేదోననే సంశయంవున్నా, మనసు మాటకు విలువిచ్చి చిత్ర పరిశ్రమకు వచ్చాను. 2002 మే 10న ‘అల్లరి’ నరేశ్‌గా మీముందున్నా. సరిగ్గా ఒక్కరోజు తక్కువ పదిహేడేళ్లకు మళ్లీ మీ ముందుకు రవిగా వచ్చి మార్కులు వేయించుకున్నా. అందాన్ని పక్కనపెట్టి ఆర్టిస్టుగా నన్ను ఆదరించటం మీ గొప్పతనం. మీకెప్పుడూ రుణపడి ఉంటా. 55 చిత్రాల బతుకు ప్రయాణంలో ఎన్నో జ్ఞాపకాలు నిండిపోయాయి. నన్ను ఈస్థాయికి తెచ్చిన పరిశ్రమ, నిర్మాతలు, దర్శకులు, టెక్నీషియన్లు, అభిమానులందరికీ ధన్యవాదాలు’ అంటూ పోస్ట్‌లో పేర్కొన్నాడు నరేశ్.