హీరోయిన్‌గా ప్రూవ్ చేసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శివ, మేఘశ్రీ జంటగా జె.ప్రభాకర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అనగనగా ఒక చిత్రమ్’. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది మేఘశ్రీ. ఈ చిత్రం ఈనెల 11న విడుదలవుతున్న సందర్భంగా మేఘశ్రీ చెప్పిన విశేషాలు. ‘ఈ సినిమాలో పరిమళాదేవి అనే పాత్రలో నటిస్తున్నాను. చాలా మెచ్యూర్డ్ గాళ్‌గా వుంటూనే అల్లరి పిల్లగా నా పాత్ర సాగుతుంది. సిటీ బ్యాక్‌డ్రాప్‌లో కాలేజీలో చదువుకునే అమ్మాయి పాత్ర. చాలా మంచి పాత్ర చేస్తున్నాను.
ఈ సినిమాలో హీరోగా నటిస్తన్న శివతో పనిచేయడం చాలా ఆనందంగా వుంది. తను చాలా స్పోర్టివ్. మంచి సహకారం అందించాడు. ఇక నా గురించి చెప్పాలంటే, నేను బెంగుళూరులో పుట్టి పెరిగాను. నాన్న సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగి. నాకు సినిమాలంటే చాలా ఆసక్తి వుండడంతో ఈ రంగానికి వచ్చాను. నేను బెంగుళూరులో డ్రామాల్లో చేసేదాన్ని. అలా ఈ సినిమాలో అవకాశం వచ్చింది. నిజానికి నా మొదటి తెలుగు సినిమా ‘ఓ మై గాడ్’. ఆ సినిమా షూటింగ్ సమయంలో ఈ సినిమా దర్శక నిర్మాతలు చూసి నన్ను హీరోయిన్‌గా ఎంచుకున్నారు. ఈ సినిమాతోపాటు ‘కాకి’ సినిమాలో నటిస్తున్నాను. ‘అనగనగా ఒక చిత్రమ్’ సినిమాతో హీరోయిన్‌గా నాకు మంచి గుర్తింపు దక్కుతుందన్న నమ్మకం వుంది. నేను సినిమాలు చేస్తూనే మరోవైపు చదువుకుంటున్నాను. ప్రస్తుతం ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నాకు మా అమ్మ సపోర్టు ఎప్పుడూ వుంది.