ఆక్సిజన్ ఫస్ట్‌లుక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోపీచంద్, రాశీఖన్నా జంటగా ఎ.ఎం.జ్యోతికృష్ణ దర్శకత్వంలో సాయిరాం క్రియేషన్స్ పతాకంపై ఐశ్వర్య నిర్మిస్తున్న చిత్రం ఆక్సిజన్. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత ఐశ్వర్య మాట్లాడుతూ, యాక్షన్ హీరో గోపీచంద్‌తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే మూడు షెడ్యూళ్లను పూర్తిచేసుకుంది. డిఫరెంట్ సబ్జెక్ట్‌తో యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాశీఖన్నా, అనూ ఇమాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ నటుడు జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్‌రాజా సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయని కథతో జ్యోతికృష్ణ అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడు. అన్ని కార్యక్రమాలు త్వరగా పూర్తిచేసి చిత్రాన్ని అంతే త్వరగా విడుదల చేస్తామన్నారు.