మేలో అ.. ఆ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నితిన్, సమంత జంటగా ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై రూపొందుతోన్న ‘అ.. ఆ’ (అనసూయ రామలింగం వర్సెస్ ఆనందవిహారి) ఈ సినిమా టీజర్ విడుదలైంది. ఈ సందర్భంగా నిర్మాత రాధాకృష్ణ మాట్లాడుతూ, టీజర్ విడుదలైన తరువాత చాలా మంచి రెస్పాన్స్ వస్తోందని, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలంనుండి జాలువారిన ఓ మంచి ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఇదని, ఈ ఆడియోను ఈనెలలోనే విడుదల చేసి మేలో చిత్రాన్ని విడుదల చేస్తామని అన్నారు. మిక్కీ జె మేయర్ అందించిన పాటలు తప్పకుండా అందరికీ నచ్చుతాయని, త్రివిక్రమ్ దర్శకత్వంలో తొలిసారి నితిన్ నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయని, నితిన్ సరసన సమంత, అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటిస్తున్నారన్నారు. ఈ చిత్రానికి సంగీతం:మిక్కి జె మేయర్, కెమెరా:నటరాజ్ సుబ్రహ్మణ్యం, ఎడిటింగ్:కోటగిరి వెంకటేశ్వరరావు, నిర్మాత:సూర్యదేవర రాధాకృష్ణ, దర్శకత్వం:త్రివిక్రమ్.