నాన్చుడు నచ్చదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్ గ్లామర్ భామ రకుల్ ప్రీత్‌సింగ్ స్పీడ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనుండదు. నాలుగేళ్లలో టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన ఈ బ్యూటీ, అడపాదడపా బాలీవుడ్‌నూ ఎలేయాలన్న ప్రయత్నాల్లో నిమగ్నమైవుంది. ఊపుమీద సాగుతోన్న కెరీర్ ఒక్కసారిగా స్లో అయినట్టే కనిపిస్తోంది. ఈమధ్య సరైన హిట్టు లేక బ్యూటీకి చాన్స్‌లూ తగ్గాయి. అలాంటి రకుల్, తాజాగా ఓ ఇంటర్వ్యూలో తానేంటో కుండబద్ధలు కొట్టి మరీ చెప్పింది. సినిమా ఒప్పుకునే విషయంలో నాన్చడం నాకు ఇష్టముండదు. కేవలం ఐదే నిమిషాల్లో నా నిర్ణయాన్ని చెప్పేస్తానంటోంది రకుల్. విషయాన్ని తేల్చకుండా నాన్చడమంటే మహా చిరాకట. రకుల్ మాటల్లోనే కాదు చేతల్లోనూ స్పీడ్ మెయిన్‌టైన్ చేస్తుంటుందని చాలామంది దర్శక నిర్మాతలు అంటుంటారు. గ్లామర్ హీరోయిన్‌గా తక్కువ సమయంలో మంచి క్రేజ్ తెచ్చుకున్న రకుల్, ప్రస్తుతం నాగార్జున సరసన మన్మథుడు-2 చేస్తోంది. దాంతోపాటు బాలీవుడ్‌లో అజయ్‌దేవ్‌గన్‌తో ‘దే దే ప్యార్ దే’ ప్రాజెక్టులోనూ మెరుపులు మెరిపించనుంది. బాలీవుడ్ జనాన్ని మెప్పించి జెండా పాతేందుకు కాస్త మోతాదుకు మించే అందాలు చూపించిందని అంటున్నారు. ఈ సినిమాతో ఎలాగైనా బాలీవుడ్‌లో సెటిలవ్వాలన్న ఆలోచనైతే రకుల్‌కు గట్టిగానే ఉందని సన్నిహితులూ చెబుతున్నారు. పెంచిన గ్లామర్ డోస్ ఎంతవరకూ కెరీర్‌కు ఉపకరిస్తుందో చూడాలి.