రొమాంటిక్ కామ్రేడ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడలల్లె వేచె కనులే/ కదిలేను నదిలా కలలే/ ఒడిచేరి ఒకటై పోయె/ తీరం కోరె ప్రాయం -అంటూ రెహమాన్ సృజించిన సాహిత్యాన్ని సిద్ శ్రీరామ్, ఐశ్వర్య రవిచంద్రన్ మార్ధవంతో పాడారు -డియర్ కామ్రేడ్ కోసం. విజయ్ దేవరకొండ, రష్మిక మండన కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం -డియర్ కామ్రేడ్. ఫైట్ ఫర్ వాట్ యు లవ్ అనేది టైటిల్ ట్యాగ్ లైన్. విడుదలకు ముస్తాబవుతున్న చిత్రం నుంచి బుధవారం రెండో వీడియో లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. అదే -కడలల్లె వేచె కనులే. తొలిపాట మాదిరిగానే సెకెండ్ సింగిల్ సైతం క్లాసిక్ టచ్‌తోనే సాగింది. రొమాంటిక్‌గా సాగే ఈ పాట సంగీత ప్రియులని అలరిస్తుందన్న నమ్మకంతో ఉంది చిత్రబృందం. భరత్ కమ్మ తెరకెక్కించిన స్టూడెంట్ బ్యాక్‌డ్రాప్ లవ్ స్టోరీని జూలై 26న స్క్రీన్స్‌కు తేనున్నారు. తెలగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్నట్టు ఇప్పటికే చిత్రబృందం వెల్లడించింది. మైత్రీ మూవీ మేకర్స్, బిగ్‌బెన్ సినిమాస్ బ్యానర్లపై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, సీవీఎం (మోహన్), యవ్ రంగినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.