శ్రద్ధకు భలే ఛాన్స్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఘన విజయం సాధించిన నాని జెర్సీలో హీరోతో జోడీ కట్టిన శ్రద్ధశ్రీనాథ్ తన పెర్ఫార్మెన్స్‌తో మంచి మార్కులే సంపాదించింది. మరోపక్క తమిళంలో ఆమెచేసిన ‘కె 13’కూ మంచి రెస్పాన్స్ వచ్చింది. వరుస విజయాలతో శ్రద్ధకు ఆఫర్లు పెరుగుతున్నాయి. హీరో విశాల్ కొత్త ప్రాజెక్టులో శ్రద్ధకు చాన్స్ కొరికే అవకాశం ఉందని కోలీవుడ్ వర్గాల మాట. గతంలో విశాల్ చేసిన సైబర్‌క్రైమ్ థ్రిల్లర్ ‘ఇరుంబు తిరై’కు సీక్వెల్‌గా కొత్త ప్రాజెక్టు వస్తోందని, అందులో శ్రద్ధకు కీలకమైన పాత్ర ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. సీక్వెల్ ప్రాజెక్టునూ పిఎస్ మిత్రన్ తెరకెక్కిస్తాడట. తమిళంతోపాటు తెలుగులోనూ ఒకేసారి సినిమాను విడుదల చేసే ఆలోచన చేస్తున్నారు. ఇటు టాలీవుడ్‌లోనూ శ్రద్ధకు క్రేజ్ పెరుగుతోంది. వైవిధ్యమైన కథలు రాసుకునే దర్శకులు ఆమెవైపు ఓ కనే్నస్తున్నారట.