నాతో కిరికిరి అంటే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాతో కిరికిరి అంటే పోచమ్మ గుడిముంగిట పొట్టేల్ని కట్టేసినట్టే.. -అంటూ యాక్షన్ ఎపిసోడ్ ఫినిషింగ్ డైలాగ్‌తో రెచ్చిపోయాడు డబుల్ దిమాక్ శంకర్. ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న చిత్రం -ఇస్మార్ట్ శంకర్. రామ్ బర్త్‌డే సందర్భంగా బుధవారం టీజర్ విడుదల చేశారు. ‘పతా హై మై కౌనూ.. శంకర్.. ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్’ అంటూ ఓల్డ్ సిటీ బ్యాక్‌డ్రాప్‌లో హీరో రామ్ స్టయిల్‌గా తనని ప్రత్యర్థి వర్గానికి ఇంట్రొడ్యూస్ చేసుకోవడంతో టీజర్ మొదలైంది. ‘మూర్ ముంత చోడ్ చింత’ డైలాగ్‌ని వెటకారంగా చెప్పడాన్ని చూస్తే -మాస్ మసాలాను పూరి ఎంత బలంగా దట్టించాడో అర్థమవుతోంది. డ్రెస్సింగ్, స్మోకింగ్ స్టయిల్‌లో పక్కా మాస్ క్యారెక్టర్‌లో రామ్ రెచ్చిపోయిన విషయాన్ని టీజర్‌లో రుచి చూపించాడు పూరి. ఇస్మార్ట్ శంకర్‌తో జోడీ కట్టిన నిధి అగర్వాల్, నభానటేష్‌ని టీజర్‌లో ఎక్కడా రివీల్ చేయలేదు. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్, చార్మి సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం -ఇస్మార్ట్ శంకర్. ప్రస్తుతం గోవాలో రామ్ -నభాలపై రొమాంటిక్ సాంగ్‌ను తెరకెక్కిస్తున్నారు. మరో మూడు పాటలు చిత్రీకరిస్తే షూట్ పార్ట్ పూర్తవుతుందని చెబుతోంది చిత్రబృందం. మాస్ టచ్‌తో మణిశర్మ సంగీతం సమకూర్చిన ఓ పాట బిట్‌ను సైతం టీజర్ కట్‌లో చూపించటం బావుంది. జూన్ చివరివారంలోగానీ, జూలైలోగానీ సినిమాను విడుదల చేయనున్నట్టు చిత్రబృందం చెబుతోంది.