ఆరంభం అదిరింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

72వ అంతర్జాతీయ కేన్స్ చలన చిత్రోత్సవం ప్రపంచ సెలబ్రిటీల అందాల మధ్య వెలుగులు విరజిమ్ముతూ మొదలైంది. ఫ్రెండ్ రివేరా నదీ తీరాన సాగనున్న కేన్స్ ఉత్సవాలకు ఈ ఏడాది ప్రముఖ మెక్సికన్ దర్శకుడు అలెజాండ్రో అధ్యక్షత వహించనున్నాడు. ఆరంభ, ముగింపు వేడుకకు ఫ్రెంట్ నటుడు ఎడ్వర్డ్ బాయర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తాడు. వేడుకలు మే 25వరకూ అంటే పది రోజులపాటు అట్టహాసంగా జరగనున్నాయి. ఫ్రాన్స్ కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం ‘ది డెడ్ డోన్ట్ డై’ సినిమా ప్రీమియర్ షోతో మొదలైన ఉత్సవాల్లో తొలిరోజు ప్రముఖ పాప్ గాయని సెలీనా గోమేజ్ సందడి చేసింది. ప్రీమియర్ షోగా ప్రదర్శితమైన ‘ది డెడ్ డోన్ట్ డై’ సినీనటులు సైతం ప్రారంభ కార్యక్రమంలో సందడి చేశారు. ప్రపంచవ్యాప్తంగా కేన్స్ ఉత్సవాల కోసం ఎంపిక చేసిన ఉత్తమ చిత్రాలను ఇక్కడ ప్రదర్శించనున్నారు. ఈ ఏడాది ఏ ఒక్క భారతీయ చిత్రానికీ కేన్స్‌లో ప్రదర్శనకు అర్హత దక్కలేదు. కాకపోతే బాలీవుడ్ సెలబ్రిటీలు ఐశ్వర్యరాయ్, దీపికా పదుకొనె, కంగనా రనౌత్, సోనమ్‌కఫూర్, ప్రియాంక చోప్రా రెడ్ కార్పెట్‌పై సందడి చేయడానికి ఆహ్వానాలు అందుకున్నారు.