ప్రభాస్‌తో నటించాలనుంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోడల్‌గా కెరీర్ మొదలుపెట్టి ఆ తరువాత హీరోయిన్‌గా మారిన అందాలతార అమీ జాక్సన్‌కు వరుసగా భారీ అవకాశాలే దక్కుతున్నాయి. ఎన్నో ఆశలతో చేసిన ‘ఐ’ చిత్రం భారీ పరాజయం పాలవడంతో కాస్త నిరాశ చెందిన ఈ భామ మళ్లీ కొత్త ఉత్సాహంతో సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం రజనీకాంత్ సరసన శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘రోబో 2.0’ చిత్రంలో నటిస్తోంది.
ప్రస్తుతం విజయ్ సరసన తేరీ (పోలీసోడు) చిత్రంలో నటిస్తున్న ఈ భామకు ప్రభాస్‌పై కన్నుపడ్డట్టుంది. ఈ విషయంపై స్పందిస్తూ, ఇన్ని సినిమాలు చేసినా కూడా ఆ ఒక్క హీరోతో నటించాలనే కోరిక మాత్రం బలంగా వుందని చెబుతోంది? ఇంతకీ ఆ ఒక్క హీరో ఎవరో తెలుసా? ‘బాహుబలి’ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న ప్రభాస్. ‘బాహుబలి’లో ప్రభాస్‌ను చూసి షాక్ అయిన ఈ భామ ఆయన సరసన ఒక్క సినిమా అయినా చేయాలని ఉందనే కోరిక వెలిబుచ్చుతోంది. మరి అమీ కోరికను ప్రభాస్ నెరవేరుస్తాడో లేదో చూడాలి!

చిత్రం అమీ జాక్సన్