పప్పెట్‌లా ఉండలేను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లుశిరీష్, సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ తనదైన మార్క్ క్రియేట్ చేస్తున్నాడు. శిరీష్ తాజా ప్రాజెక్టు -ఏబీసీడీ. అమెరికన్ బాయ్ కన్‌ఫ్యూజ్డ్ దేశి టాగ్‌లైన్‌తో వస్తున్న సినిమాకు సంజీవ్ రెడ్డి దర్శకుడు. మధుర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కిన సినిమా శుక్రవారం విడుదలవుతున్న సందర్భంలో హీరో అల్లు శిరీష్‌తో ఇంటర్వ్యూ..
ఎబిసిడి కథ గురించి?
ఎబిసిడి ఒరిజినల్ వెర్షన్ రెండేళ్లకిందట చూశా. నచ్చింది. తర్వాత మళ్లీ అది చూడలేదు. రీసెంట్‌గా ఎబిసిడి ఫస్ట్ కాపీ చూశా. బాగుంది. ఈ సినిమా చేయమని ఫస్ట్ చెప్పిన వ్యక్తి రామ్‌చరణ్. తర్వాత మారుతి కూడా, నేను చేస్తే బావుంటుందని ప్రోత్సహించాడు. వరుణ్‌తేజ్ నుంచీ అదే సజెషన్ వచ్చింది. నాకూ సబ్జెక్ట్ నచ్చడంతో మొదలెట్టాం.
కొత్త దర్శకుడితో..?
సంజీవ్‌రెడ్డి స్టైల్ బాగుంది. రియల్ లైఫ్‌లో జరుగుతున్న చిన్న చిన్న ఘటనల్ని కూడా బాగా రాస్తాడు. ఓ రీమేక్ సబ్జెక్ట్ తెచ్చాడు. అది అంతగా నచ్చలేదు. ఎబిసిడి చూశారా అని అడిగాను. తనకూ నచ్చింది. అలా ప్రాజెక్టులోకి వచ్చాడు. నిజానికి ఎబిసిడి కంటేముందు సంజీవ్ చెప్పిన కథ పెద్ద డ్రామా. అందులో హీరోకు పెళ్లయి, పిల్లలు కూడా ఉంటారు. కానీ అలాంటి సినిమా చేయాలనిపించలేదు. అందుకే సంజీవ్‌ని దానిబదులు ఎబిసిడిలోకి తీసుకొచ్చాం.
నటనపరంగా జాగ్రత్తలు తీసుకున్నారా?
పూర్తిగా స్క్రిప్ట్‌కు మాత్రమే ఫిక్స్ అయ్యేవాడ్ని. అది ఎలావుంటే అలా ఫాలో అయిపోయేవాడ్ని. కానీ ఇప్పుడు కామెడీ, లవ్ సీన్స్‌లో నేను కొన్ని కొత్తగా చేస్తున్నాను. డ్రామాను మాత్రం టచ్ చేయను. నా పరిధిలో నేను కొత్తగా, అదనంగా ఎంత చేయగలనో అంతా చేస్తున్నా. ఒక నటుడిగా నాకు నేను ఓ పప్పెట్‌లా ఉండదలచుకోలేదు. డీసెంట్ యాక్టర్‌గాకంటే గుడ్ యాక్టర్‌గా ఉండాలనుకుంటున్నా.
నిర్మాణం విషయంలో సలహాలిస్తుంటారా?
ప్రొడక్షన్‌పై నాకు కాస్త అనుభవంవుంది. కానీ నేను నటించే సినిమాల ప్రొడక్షన్ పనుల్లో మాత్రం నేను జోక్యం చేసుకోను. సినిమా బడ్జెట్ ఎంత అయింది, మూవీని ఎంతకు అమ్మారులాంటి విషయాల్ని అస్సలు అడగను. నిర్మాతల్ని వాళ్ల పని వాళ్లను చేయనివ్వాలి.
మ్యూజిక్ గురించి?
ఈ సినిమాకు జుడా శాండీ మ్యూజిక్ పెద్ద ప్లస్. ఓసారి కారులో వెళ్తూ అతడు కంపోజ్ చేసిన పాట విన్నాను. బాగా నచ్చింది. ఎబిసిడికి అతడ్ని తీసుకోవాలని అప్పుడే ఫిక్సయ్యాను. పిలిచి మరీ అవకాశమిచ్చాను. టాలీవుడ్ ట్రెండ్ ఫాలో అవ్వద్దని అప్పుడే చెప్పా. రెగ్యులర్ తెలుగు టైపు సాంగ్స్ వద్దని చెప్పేశాను. అందుకే ఎబిసిడి పాటలు అంత బాగా వచ్చాయి.
రీమేక్‌లో మార్పులు చేశారా?
ఒరిజినల్ వెర్షన్‌లో ట్యూన్స్ ఒక్కటీ వాడలేదు. అన్నీ కొత్త ట్యూన్స్. కేవలం సాంగ్స్ మాత్రమే కాదు, సినిమా సీన్సూ ఒరిజినల్ నుంచి 15 మాత్రమే తీసుకున్నాం. మిగతావన్నీ కొత్తగా రాసుకున్నాం. సినిమాలో సోల్ మాత్రమే రీమేక్. మలయాళం వెర్షన్‌లో హీరోయిన్, విలన్ పాత్రలు లేవు. తెలుగులో పెట్టాం. ఒరిజినల్ సినిమా చూసినోళ్లకు కూడా మా ఎబిసిడి కొత్తగా కనిపిస్తుంది.
సినిమాల విషయంలో ఆలస్యానికి కారణం?
ఎందుకు ఆలస్యమవుతున్నాయో నాకైతే అర్థం కావడంలేదు. అది నా దురదృష్టం అనుకోవాలేమో. ఎబిసిడి సినిమాను గతేడాది జూన్‌లో స్టార్ట్ చేశాం. ఈ ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ చేయాలనుకున్నాం. కానీ లేటైపోయింది. నా వైపునుంచి ఆలస్యం అనేది ఎప్పుడూ ఉండదు. ఎప్పుడు అడిగినా కాల్షీట్లు ఇస్తున్నాను. కానీ లేట్ అవుతున్నాయి. ఈసారి మరింత జాగ్రత్తగా ఉండాలనుకుంటున్నా.

వచ్చే ఏడాదిలో రెండు సినిమాలు చేయాలనుకుంటున్నాను. వీటిలో ఒక సినిమా స్క్రిప్ట్ ఆల్రెడీ లాక్ అయింది.
అదో మంచి లవ్‌స్టోరీ.