సీత.. ఓ కొత్త ట్రెండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీత చిత్రంతో ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్
మొదలవుతుందని అంటున్నాడు
సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్.
బెల్లంకొండ శ్రీనివాస్, గ్లామర్ గాళ్ కాజల్
జంటగా సీనియర్ దర్శకుడు తేజ తెరకెక్కించిన
చిత్రం -సీత. ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్
బ్యానర్‌పై సుంకర రామబ్రహ్మం
నిర్మించారు. సినిమా విడుదలకు సిద్ధమైన
సందర్భంగా అనూప్ రూబెన్స్
మీడియాతో ముచ్చటించాడు.
సీత కథ కొత్తగా ఉంటుంది. హీరో, హీరోయిన్, విలన్ పాత్రలు కొత్తగా అనిపిస్తాయి. నిజంగా ఇది తేజ చేస్తున్న మరో ప్రయోగం. అలాంటి చిత్రానికి సంగీతం సమకూర్చటం ఆనందంగా ఉంది. నేను ఇండస్ట్రీకి తేజ ద్వారా జై సినిమాతో పరిచయమయ్యాను. తరువాత ఆయనతో ఇది నాల్గవ సినిమా. తేజతో పనిచేయడం కష్టమని అంటుంటే విన్నానుగానీ, నాకలా అనిపించదు. ఆయన క్లారిటీతో ఉంటాడు. తనకేంకావాలో తెలుసుకాబట్టి, ఏ విషయమైనా క్లియర్‌గా చెబుతాడు. ఇక సినిమాలో ఆరు పాటలుంటాయి. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు మంచి హిట్స్ అనిపించుకున్నాయి. తప్పకుండా సినిమాతో మళ్లీ నాకు మంచి పేరొస్తుందన్న నమ్మకముంది.
సినిమాల విషయంలో గ్యాప్ నిజం. అయితే, కావాలని తీసుకోలేదు. కొన్ని ప్రాజెక్టులు వచ్చాయి. కొన్ని మిస్సయ్యాయి. సో, గత ఏడాది ఒక్క సినిమా కూడా నాది లేదు.
మ్యూజిక్ విషయంలో కొత్తగా ఉండేలా ప్రయత్నిస్తా. ప్రశంసలు అందుకున్నపుడు విమర్శలూ తీసుకోవాలన్నది నా నైజం. అప్పుడే మనల్ని మనం ప్రూవ్ చేసుకోగలుగుతాం.
ఈ సినిమాలో పాటలకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో.. అలాగే రీ రికార్డింగ్‌కూ అంతే ప్రాధాన్యత ఉంటుంది. ఆర్‌ఆర్ విషయంలో కొత్త ప్రయోగం చేశాను. తప్పకుండా ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తుంది. సీత అని టైటిల్ పెట్టడంతో ఇది లేడీ ఓరియెంటెడ్ చిత్రం అని అనుకుంటున్నారు. కానీ కాదు. ఇది మామూలు కథ. అన్నీ ఉంటాయి. సీత అన్నది హీరోయిన్ పేరు మాత్రమే. సినిమా తప్పకుండా ప్రతి ఒక్కరికీ నచ్చేలా ఉంటుంది.
ప్రస్తుతం కన్నడలో ఓ సినిమా చేస్తున్నాను. దాంతోపాటు తెలుగులో రెండు సినిమాలున్నాయి. అందులో స్టార్ హీరోతో ఒకటి ఉంటుంది. దాని గురించి త్వరలోనే చెబుతాను.