నో చాన్స్...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్లామర్ భామ ఇలియానాకు ఈమధ్య మరీ బ్యాడ్ టైమ్ ఎక్కువైనట్లుంది. ఇప్పటికే బాలీవుడ్‌లో సరైన హిట్ లేదు. దానికితోడు అవకాశాలు కూడా తగ్గిపోయాయి. ప్రస్తుతం చేస్తున్న ఒకే ఒక్క సినిమా ‘రుస్తుం’.
అక్షయ్‌కుమార్ సరసన హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ భామ సినిమాలో గ్లామర్ షోకు రెడీ అయినా కూడా దర్శక నిర్మాతలు మరో హీరోయిన్‌తో స్పెషల్ సాంగ్ చేయించడానికి రెడీ అయ్యారు. మరోవైపు ఇలియానా రేటు తగ్గించినా కూడా ఫలితం లేకపోయింది. సౌత్ నుంచి అవకాశాలు క్యూ కడతాయని భావించిన ఈ భామకు నిరాశే మిగిలింది. అప్పట్లో
ఇలియానాను నెత్తిమీద పెట్టుకుని ఊరేగించిన సౌత్ పరిశ్రమపై చిన్నచూపు చూసిందీ భామ. వచ్చిన అవకాశాల్ని కాదనడంతో ఇప్పుడెవరూ ఇలియానాతో సినిమా చేయడానికి దక్షిణాది హీరోలు కానీ, దర్శకులు కానీ పెద్దగా ఆసక్తి చూపడంలేదట. మొత్తానికి ఇలియానాకు ఏ సినిమాల్లో కూడా ఖాళీ లేనట్లే కన్పిస్తోంది.

చిత్రం ఇలియానా