ఆగస్టు 30న గ్యాంగ్‌లీడర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేచురల్ స్టార్ నాని హీరోగా వెర్సటైల్ డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్ (సివిఎం) నిర్మిస్తున్న నాని గ్యాంగ్‌లీడర్ ఆగస్టు 30న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు మాట్లాడుతూ- 14 నుండి శంషాబాద్‌లో మూడో షెడ్యూల్ ప్రారంభమైంది. జూన్ 30కి టోటల్ షూటింగ్ పూర్తవుతుంది. ఆగస్టు 30న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌కి ప్లాన్‌చేశాం అన్నారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు విక్రమ్ కె.కుమార్ మాట్లాడుతూ- ఈ చిత్రం ఒక డిఫరెంట్ లుక్‌తో వుండే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. సినిమాలో ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంటుంది. ఈ చిత్రంలో ఆర్‌ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ ఒక పాత్ర పోషిస్తున్నారు. ప్రియాంక, లక్ష్మీ, శరణ్య, అనీష్ కురువిల్లా, ప్రియదర్శి, రఘుబాబు, వెనె్నల కిశోర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు అన్నారు.