ఎంటర్‌టైనర్ జోనర్‌లో తుహిరే మేరీ జాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికాస్, కల్యాణి జంటగా దుర్గాదేవి ఫిలింస్ పతాకంపై ఎన్.డి.ఉదయ్‌కుమార్ దర్శకత్వంలో కవనరెడ్డి నాగేశ్వర రావు రూపొందిస్తున్న చిత్రం ‘తుహిరే మేరీ జాన్’. ఈ సినిమాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి విడుదలకు సిద్ధం చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు ఉదయ్‌కుమార్ మాట్లాడుతూ, ఫుల్ లెంగ్త్ లవ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేశామని, పాటలన్నీ అద్భుతంగా వచ్చాయని తెలిపారు. అందరూ కొత్తవాళ్ళతో చేసిన ఈ చిత్రం కథ కథనాలలో వెరైటీ వుండడంతో తప్పక హిట్ అవుతుందన్న నమ్మకం వుందని ఆయన తెలిపారు. స్నేహం, ప్రేమ, కుటుంబ విలువలు కలగలసి నటనకు ప్రాధాన్యం వున్న ప్రతి పాత్రను ప్రేక్షకులకు నచ్చేలా తీర్చిదిద్దామని, ఆరు పాటలు సినిమాకు హైలెట్‌గా వుంటాయని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: జోడా శాండి, ఎడిటింగ్: రాజు లీల, పాటలు: చాణక్య, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎన్.డి.ఉదయ్‌కుమార్.