ప్రేమించే... నాగకన్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గతంలో జాతీయ నటుడు కమల్‌హాసన్ తమిళంలో చేసిన నియా చిత్రానికి సీక్వెల్‌గా నియా-2 తెరకెక్కింది. ఈ చిత్రాన్ని తెలుగులో నాగకన్యగా విడుదల చేస్తున్నారు. హీరో జైతో రాయ్‌లక్ష్మి, వరలక్ష్మి శరత్‌కుమార్, కేథరిన్ థ్రెస్సా జోడీ కట్టారు. ఎల్ సురేష్ తెరకెక్కించిన చిత్రాన్ని తెలుగులో లైట్‌హౌస్ సినీ మ్యాజిక్ పతాకంపై నిర్మాత కెఎస్ శంకర్‌రావు విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మీడియాతో మాట్లాడుతూ తెలుగు, తమిళ భాషల్లో 24న సినిమా విడుదల చేస్తున్నాం. పాము కథలుగా గతంలో వచ్చిన నోము, దేవతలారా దీవించండి, దేవి, అమ్మానాగమ్మ వంటి చిత్రాలు భారీ విజయాలు సాధించాయి. కానీ అవన్నీ పగ నేపథ్యంగా రూపొందాయి. నాగకన్య అందుకు భిన్నమైన కథా వస్తువుతో తెరెకెక్కింది. పగతోకాకుండా ప్రేమ నేపథ్యంగా సాగే చిత్రమిది. అన్ని వర్గాలు సినిమాను ఎంజాయ్ చేసేలా తీర్చిదిద్దామన్నారు. దర్శకుడు ఎల్ సురేష్ మాట్లాడుతూ గతంలో తెలుగులో నిఖిల్ హీరోగా కళావర్ కింగ్ చిత్రానికి దర్శకత్వం వహించాను. తర్వాత తమిళ చిత్రాలు చేస్తూ వచ్చాను. ఈ సినిమాతో మళ్లీ తెలుగు ప్రేక్షకులకు దగ్గరవుతానన్న నమ్మకం ఉంది. 40 నిమిషాలపాటు సాగే కాలనాగు గ్రాఫిక్స్ చిత్రానికి హైలైట్. కథ డిమాండ్‌మేరకే గ్రాఫిక్స్ కోసం భారీగా వెచ్చించాం. కింగ్ కోబ్రాను గ్రాఫిక్స్‌లో డిజైన్ చేశామని, ఇప్పటి వరకూ అందంగా కనిపించిన రాయ్‌లక్ష్మి ఈ చిత్రంలో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారన్నారు. ఈ సినిమాకు సినిమాటోగ్రఫీని రాజావేల్ మోహన్, సంగీతాన్ని షబీర్ సమకూర్చారు.