బాలీవుడ్‌పై కన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘బెంగాల్ టైగర్’ సినిమా తరువాత రవితేజ బాగా సైలెంట్ అయ్యాడు. ఆయన చేయాలనుకున్న కొత్త సినిమాల షూటింగ్ ఇంకా మొదలు కాలేదు. ‘రాబిన్‌హుడ్’ సినిమా ఎప్పుడు మొదలవుతుందో తెలియదు. దిల్‌రాజుతో సినిమా కాన్సిల్ అయింది. ఇప్పుడు రవితేజ చేతిలో సినిమాలే లేవు. దాంతో రవితేజ దృష్టి బాలీవుడ్‌పై పడ్డట్టు అనిపిస్తోంది. ‘తెలుగుకన్నా హిందీలో బాగా మాట్లాడగలను.. నాకు హిందీ సినిమాలు చేయాలని ఉంది.. అయితే ఆ స్క్రిప్ట్ అంత బాగుండాలని’ ఈమధ్య రవితేజ అన్న విషయానినబట్టి సినీవర్గాలు ఈ అంచనాకు వచ్చాయి. బాలీవుడ్‌లో అయితే భిన్నమైన కానె్సప్ట్‌లతో సినిమాలు వస్తున్నాయని, అక్కడయితే భిన్నమైన సినిమాలు చేయ్యొచ్చు అని అంటున్నాడు రవితేజ. దీన్ని బట్టి చూస్తే బాలీవుడ్‌లో ప్రయత్నాలు సాగుతున్నట్టే ఉన్నాయి మరి?