బన్నీకి జోడీగా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మొదటి షెడ్యూల్‌ని పూర్తిచేసిన యూనిట్ రెండో షెడ్యూల్‌కోసం సిద్ధం అవుతుంది. ఈ సినిమా విషయంలో రెండో హీరోయిన్ విషయం టెన్షన్ పెడుతుంది యూనిట్‌కి. ఇప్పటికే మొదటి హీరోయిన్‌గా గ్లామర్ భామ పూజాహెగ్డేని ఎంపిక చేసారు. అందులో రెండో హీరోయిన్‌కు మంచి కీ రోల్ ఉండడంతో ఎవరిని తీసుకోవాలో అన్న ఆలోచనలో పడ్డారు త్రివిక్రమ్. ఇప్పటికే పలువురు హీరోయిన్స్‌ని పరిశీలించి ఫైనల్‌గా కేతికశర్మను ఎంపిక చేసినట్టు టాక్. పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ హీరోగా నటిస్తున్న రొమాంటిక్ సినిమాలో కేతికశర్మ హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయం అవుతుంది. మొదటి సినిమా విడుదలకాకముందే రెండో సినిమాకు స్టార్ హీరో సరసన ఛాన్స్ కోట్టేసింది కేతికశర్మ. నిజంగా లక్కీ కదూ!! ప్రస్తుతం ఆమెతో సంప్రదింపులు జరుపుకున్నారట. మొత్తానికి రెండో హీరోయిన్ కూడా ఖరారుకావడంతో ఇక టీమ్ సీరియస్‌గా షూటింగ్‌పై ఫోకస్ పెట్టనున్నారు. ఈ సినిమాను త్వరగా పూర్తిచేసి దసరాకు విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట.