‘ఇట్లు’.. ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఓ యువ రైతు తోటి రైతలకు మంచి చేస్తూ, అందమైన అమ్మాయిని ప్రేమించి పెళ్ళిచేసుకొని జీవితంలో సెటిలవ్వాలనుకుంటాడు. కాని అతని జీవితం ఎలాంటి మలుపు తిరిగిందో? తెలియాలంటే ‘ఇట్లు’ సినిమా చూడాల్సిందే అంటున్నాడు దర్శకుడు రోశిరెడ్డి పందిళ్ళపల్లి. అమీర్, శిరీష, అశ్విని హీరో హీరోయిన్లుగా రోశిరెడ్డి పందిళ్ళపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఇట్లు. శ్రీజా ఆర్ట్స్ పతాకంపై రాజుగౌడ్ పుదారీ, మెట్టయ్య వుప్పల, రఘు, శ్రీరాములు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. హీరో హీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నటుడు నారాయణరావు క్లాప్‌నివ్వగా, వాణి (ఎంఎఫ్‌టిఐ) కెమెరా స్విచాన్ చేశారు. మద్దూరి వెంకట కృష్ణమోహన్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు రోశిరెడ్డి మాట్లాడుతూ ‘యాక్షన్, థ్రిల్లర్, రొమాన్స్, కామెడీ అంశాల మేళవింపుగా ఈ సినిమా రూపొందిస్తున్నామని, ఇట్లు టైటిల్ ఎందుకు పెట్టామనేది సస్పెన్స్’ అన్నారు. నారాయణరావు మాట్లాడుతూ, ‘నేను, కృష్ణమోహన్ మధు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో ఫ్యాకల్టీగా పనిచేశాం. మా శిష్యుడు ఈ సినిమాని రూపొందించడం ఆనందంగా ఉంది. కొత్తవారిని తెలుగు పరిశ్రమ, ప్రేక్షకులు ఎప్పుడూ ప్రోత్సహిస్తారు. ఈ టీమ్‌ని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నా’ అని అన్నారు. నిర్మాత రాజగౌడ్ మాట్లాడుతూ ’మా బ్యానర్‌లో ఇది మొదటి చిత్రం. రోశిరెడ్డి గత 12 ఏండ్లుగా తెలుసు. ఆయన ఈ కథని నెరేట్ చేసిన విధానం బాగానచ్చి నిర్మించేందుకు ముందుకువచ్చాం’ అని తెలిపారు.