తప్పదుమరి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నా పేరు సూర్య ఫెయిల్యూర్‌తో కొత్త ప్రాజెక్టుపై ఆచి తూచి అడుగులేస్తున్నాడు అల్లు అర్జున్. కొంత గ్యాప్ తరువాత దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో జర్నీకి సిద్ధమవ్వడం తెలిసిందే. ఈ ప్రాజెక్టులో బన్నీ సరసన పూజా హెగ్దె కనిపించనుంది. ప్రాజెక్టు సెట్ చేయడానికే ఎక్కువ గ్యాప్ తీసుకున్న బన్నీ, షూటింగ్ లేట్ లేకుండా పూర్తి చేసి దసరాకు సినిమాను విడుదల చేయాలనుకున్నారు. మరీ గ్యాప్ వస్తే ఫ్యాన్స్ నిరాశకు గురవుతారన్నది బన్నీ ఆలోచన. అయితే, ఆ నిర్ణయం వర్కౌటయ్యేలా కనిపించటం లేదు. దసరా రేసులో మెగాస్టార్ ప్రతిష్టాత్మక చిత్రం సైరా వచ్చే అవకాశం కనిపిస్తోంది. చాలాకాలంగా షూటింగ్ జరుపుకుంటున్న సైరాను ఇక ఆలస్యం చేయకుండా దసరాకు తెచ్చే యోచనలో చిత్రబృందం ఉంది. ఇదే జరిగితే, సైరాకు రూట్ క్లియర్ చేస్తూ వచ్చే సంక్రాంతిని టార్గెట్ చేద్దామన్న యోచనలో త్రివిక్రమ్, బన్నీ ఉన్నారంటున్నారు. ఇప్పటికే సంక్రాంతి బరిలో బాలకృష్ణ- కెఎస్ రవికుమార్, మహేశ్ -అనిల్ రావిపూడి, సాయితేజ్- మారుతి ప్రాజెక్టులున్నాయి. సంక్రాంతి రేసులో ఉన్నట్టు ఆయా చిత్రబృందాలు ఇప్పటికే ప్రకటించుకున్నాయి కూడా. ఇక పేట హిట్టుతో సంక్రాంతి సెంటిమెంట్‌ను మరోసారి ఫీలైన రజనీ సైతం -మురుగదాస్‌తో చేస్తున్న ‘దర్భార్’ చిత్రాన్ని సంక్రాంతికే తేనున్నాడు. ఇన్ని ప్రాజెక్టులు బరిలోవున్నా, కథపై నమ్మకంతో తమ ప్రాజెక్టునూ సంక్రాంతి రేసులోనే ఉంచాలని త్రివిక్రమ్, బన్నీ నిర్ణయించుకున్నట్టు సమాచారం. అయితే విడుదల విషయంలో *కండిషన్లు అప్లై కావొచ్చు.