అఖిల్.. భాస్కర్.. వాసూ స్క్వేర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అఖిల్ అక్కినేని నాల్గవ సినిమా మొదలైంది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జిఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.5గా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో బన్నీ వాసు, వాసు వర్మ ఈ సినిమా నిర్మించనున్నారు. సినిమా పూజా కార్యక్రమాలు ఫిల్మ్‌నగర్ దేవాలయంలో జరిగాయి. కింగ్ నాగార్జున, అమల, మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ, అల్లు అరవింద్ భార్య నిర్మల, దర్శకులు పరశురామ్, శ్రీకాంత్ అడ్డాల, మారుతి హాజరయ్యారు. అక్కినేని నట వారసుడిగా పరిచయమైన అఖిల్ హలో, మిస్టర్ మజ్ను లాంటి లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైన్స్‌తో తనేంటూ నిరూపించుకున్నాడు.
ఎవర్‌గ్రీన్ బొమ్మరిల్లు, ఆ తరువాత పరుగు ప్రాజెక్టులతో తనేంటూ నిరూపించుకున్న దర్శకుడు భాస్కర్ కాంబినేషన్‌లో చిత్రం అనగానే క్రేజ్ మరింత పెరిగింది. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ప్రొడ్యూసర్‌గా 100 పర్సెంట్ లవ్, పిల్లా నువ్వులేని జీవితం, గీతగోవిందం వరకు బ్లాక్‌బస్టర్ విజయాలు సొంతం చేసుకున్నారు. బన్నీ వాసు యువ నిర్మాతగా సక్సెస్ రేట్ ఎక్కువగా వున్న నిర్మాతల్లో ఒకరిగా తనకంటూ ప్రత్యేకత ఏర్పరచుకున్నారు. ఇపుడు ఈ చిత్ర కథ నచ్చిన మరో యంగ్ దర్శకుడు వాసు వర్మ మొట్టమొదటిసారిగా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి బన్నీ వాసుతో కలిసి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నటీనటులు, సాంకేతిక నిపుణులు, షూటింగ్ షెడ్యూల్స్ వివరాలు త్వరలో తెలియజేస్తామని నిర్మాతలు వెల్లడించారు.