సైలెంట్‌గా మొదలైంది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భాగమతి సినిమా తరువాత చాలా గ్యాప్ తీసుకున్న జేజేమ్మ అనుష్క తన నెక్స్ట్ సినిమాను ఈ రోజు అమెరికాలో మొదలుపెట్టింది. గత కొన్ని రోజులుగా ఈ సినిమా కోసం హార్డ్ వర్డ్ చేసి బరువు బాగా తగ్గింది. కోన ఫిలిం మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్‌పై ప్రముఖ రచయిత కోన వెంకట్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘సైలెంట్’ అనే టైటిల్ ఖరారు చేశారు. తెలుగు, ఇంగ్లీష్, తమిళ భాషల్లో ఇది తెరకెక్కుతోందని, తెలుగు టైటిల్ నిశ్శబ్దం అని ఫిక్స్ చేయగా ఇంగ్లీష్ వెర్షన్ కోసం సైలెంట్ అనే టైటిల్ ఖరారు చేశారు. అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తుండగా, తెలుగు హీరోయిన్ అంజలి కూడా ఇందులో మరో కీ రోల్ పోషిస్తోంది. మాధవన్, షాలినీ పాండే తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమాను త్వరగానే పూర్తిచేస్తారట. కాగా అనుష్క తాజాగా మెగాస్టార్ చిరంజీవి సైరాలో కూడా ఓ గెస్ట్ రోల్ కనిపిస్తోందట.. అనుష్క లావుగా ఉండడంతో ఆమెకు చాలా అవకాశాలు తగ్గాయి. భాగమతి తరువాత కావాలని గ్యాప్ తీసుకుని స్లిమ్ అయ్యే పనిలో సీరియస్‌గా పడి గ్లామర్‌గా వచ్చేసిందని అంటున్నారు.