వారెవ్వా.. ఆలియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘టైమ్స్ మోస్ట్ డిసైరబుల్ విమెన్-2018’గా బాలీవుడ్ బబ్లీ బ్యూటీ అలియాభట్ ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా ప్రఖ్యాత టైమ్స్ మ్యాగజైన్ నిర్వహించిన పోల్‌లో బాలీవుడ్‌లో ఉన్న అందరు సుందరాంగులను వెనక్కునెట్టి అలియా ఈ అరుదైన గౌరవం దక్కించుకుంది. గత సంవత్సరం 37వ స్థానంలోఉన్న అలియా ఏకంగా 36 స్థానాలు మెరుగుపరచుకుని, నెంబర్ వన్ పొజిషన్‌కి చేరింది. బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పడుకొనే రెండవ స్థానం నుండి క్రింది జారీ నాల్గవ పొజిషన్లో ఉండగా, మరో టాప్ హీరోయిన్ కత్రినా ఒక స్థానం మెరుగుపరుచుకొని మూడవ స్థానానికి చేరింది. ఇక టాప్ ఫైవ్‌లో కొత్తగా ఈ లిస్ట్‌లో స్థానం పొందిన మీనాక్షిచౌదరి రెండు, గాయత్రీ భరద్వాజ్ ఐదుతో టాప్ ఫైవ్‌లో స్థానం సంపాదించారు. 2012 దర్శక నిర్మాత కరణ్‌జోహార్ డైరెక్షన్‌లో వచ్చిన ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ మూవీతో హీరోయిన్లుగా తెరంగేట్రం చేసిన అలియా పలు హిట్ మూవీస్‌లో నటించింది. దర్శక ధీరుడు రాజవౌళి, తారక్ చరణ్‌లతో చేస్తున్న భారీ బడ్జెట్ మూవీ ‘ఆర్‌ఆర్‌ఆర్’లో చరణ్‌కి జోడీగా అలియా నటిస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీ సెట్‌లో జరుగుతున్న షూటింగ్ షెడ్యూల్‌లో అలియా జాయిన్ అయినట్టు సమాచారం.