ఖమోషి వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సౌత్ స్టార్ హీరోయిన్ తమన్నా బాలీవుడ్‌లో రెండో ప్రయత్నంగా చేసిన చిత్రం ‘ఖామోషి’. చక్రి తోలేటి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ముందుగా మే 31న విడుదల చేయాలని నిర్ణయించారు. కానీ ఇప్పుడు ఆ తేదీని జూన్ 14కు వాయిదావేసినట్టు ప్రకటించారు. ఈ వాయిదాకు కారణం సినిమాలో విఎఫ్‌ఎక్స్ ఎక్కువగా ఉండటమేనని, వాటిని పూర్తిచేయడం కోసమే టీమ్ ఈ వాయిదా నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ఈ సైకో హర్రర్ డ్రామాలో తమన్నా మాట, వినికిడి లోపం ఉన్న పాత్రలో నటించగా సైకో పాత్రలో ప్రభుదేవా నటించారు. ఈ సినిమా తమిళ వెర్షన్‌లో నయనతార నటించడం జరిగింది. దాన్నికూడా జూన్ 14కు వాయిదావేశారు. ఇకపోతే తమన్నా, ప్రభుదేవాలు నటించిన మరొక చిత్రం ‘అభినేత్రి 2’ ఈనెల 31న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.